జగనన్నతోడు పథకం వెబ్సైట్ నుంచి ఎస్‌టి, గౌడ తెగను తొలగింపు విధానం, ప్రభుత్వ కుట్రలో భాగమే? అరకు జనసేన నాయకులు సాయిబాబా

      అరకు, (జనస్వరం) :  రాష్ట్రములో ఎస్ టి, వాల్మీకి, భగత తెగలను ప్రభుత్వ వెబ్సైట్లో తొలగింపుపై ఆదివాసులు తీవ్రంగా ఆందోళనతో వుండగా, ఆదివాసీ గౌడ తెగను జగనన్న తోడు వెబ్సైట్ నుంచి తొలగించడం దారుణమని జనసేన పార్టీ  Ex ఎం‌పి‌టి‌సి సాయిబాబా ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న తోడు పథకం కోసం ఆదివాసీ గౌడతెగల వారు ఆదివాసీ గౌడ మిత్రుడు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న, ఆదివాసీ ఎస్ టి జాబితాలో కనిపించటం లేదని అన్నారు. ఫలితంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అనర్హుల అవుతారని తెలిపారు. ఆదివాసీలపై ప్రభుత్వం కుట్ర భాగంగానే నాడు వాల్మీకి, భగత, నేడు గౌడ తెగను ప్రభుత్వ వెబ్సైట్ నుంచి తొలగించి, ఆదివాసీలను ఆగౌరవపరిచేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది అని అన్నారు. ఈ తరుణంలో ఆదివాసీ తెగలు, మనం అందరు కలిసి ఐక్యంగా ఉండి, మనహక్కుల కోసం, చట్టాలకోసం పోరాడాలని  జనసేన పార్టీ తరుపున సాయిబాబా  పిలుపునిచ్చారు. ఇప్పటి కైన ప్రభుత్వ తీరు మార్చుకోవాలని, లేకపోతే రానున్న రోజుల్లో  ఆదివాసులు గుణపాఠం చెబుతారని  ఈ సందర్భంగా ఆయన  ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

See also  కుటుంబ సభ్యులను కించపరచటం తగదు - జనసేనపార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు