
గుంతకల్లు, (జనస్వరం) : జనసేన పార్టీ అనంతపురం జిల్లా జాయింట్ సెక్రటరీ, సేవాతత్పరుడు శ్రీ ఆరికేరి జీవన్ కుమార్ గారు ఆదేశాల మేరకు గుంతకల్లు పఠనం తిలక్ నగర్ లో గల నిరుపేద కుటుంబాలకు చెందిన వికలాంగ మహిళలకు వాకింగ్ స్టిక్స్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ గుంతకల్లు నాయకులు మాట్లాడుతూ వికలాంగులను ఆదుకోవడంలో ప్రభుత్వ వైపల్యం చెందిందని, జనసేన పార్టీ ప్రభుత్వం రాగానే వికలాంగులను ఆదుకుంటుందని, అలాగే మీకు ఎలాంటి కష్టం వచ్చిన జనసేన పార్టీ నాయకులు అరికేరి జీవన్ కుమార్ గారు ఆదుకుంటారు అని తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమములో జనసేన పార్టీ గుంతకల్లు నియోజకవర్గం నాయకులు గోపీ (చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గుంతకల్లు ) హెన్రీ పాల్, బండి మురళి, వేణు, విజయ్ తదితురులు పాల్గొన్నారు.








