తమ స్వంత నిధులతో రోడ్డుకు మరమ్మత్తులు చేసిన గొటివాడ జనసైనికులు

తమ స్వంత నిధులతో రోడ్డుకు మరమ్మత్తులు చేసిన గొటివాడ జనసైనికులు

              విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం గొటివాడ నుంచి గాలిభీమవరం వెళ్లే మార్గంలో రోడ్డు చాలా ఏరియాలో గుంతలు పడి చాలా ప్రమాదకరంగా ఉంది.  ప్రభుత్వం కాని, స్థానిక నాయకులు, అధికారులు సైతం ఎవరు పట్టించుకోవటం లేదు. పలుమార్లు అధికారులకు వినతి అందించినా లాభం లేదని వాపోయారు. అందువలన ఈ పరిస్థితులు గమనించిన గొటివాడ జనసేన నాయకులు ఇరోతి తరుణ్ కుమార్ మరియు గొటివాడ జనసేన కార్యకర్తలు ఆధ్వర్యంలో కేసరబొగ్గు, పిక్క వేసి మరమత్తు చేయటం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ నాయకులు ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారని, ప్రజల అవసరాలను పట్టించుకోవడం లేదని అన్నారు. నాయకులు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను తామే  తింటున్నారు తప్ప, ప్రజలకు సంక్షేమాన్ని అందించడం లేదని అన్నారు. 

See also  అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే జనసేన - టిడిపి పార్టీలను ఆశీర్వదించండి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :