అనారోగ్యంతో బాధపడుతున్న జనసైనికుడికి ఆర్థిక సాయం చేసిన జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు

     పాలకొండ, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం తూడి గ్రామానికి చెందిన మోయ్యి.బాలకృష్ణకు గత కొద్దిరోజుల నుండి అనారోగ్యం కారణంగా రోజు రోజుకి ఆరోగ్య పరిస్థితి చాలా ఆందోళనకరంగా మారడం జరిగింది. పాలకొండ జనసేన నాయకులు గర్భాన సత్తిబాబుకి విషయం తెలియ చేయడంతో వెంటనే గ్రామానికి చేరుకొని బాధితుడి యొక్క యోగ క్షేమాలను తెలుసుకొని చికిత్స చేసిన డాక్టర్ కి ఫోన్ చేసి అతని ఆరోగ్య సమస్యను తెలుసుకొని బ్లడ్ అవసరమని చెప్పగానే వెంటనే బ్లడ్ ఇప్పించి, మందులు ఖర్చు నిమిత్తం కొంత ఆర్థిక సహాయం చేస్తూ, అలాగే ఆయనకి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొన్నారు.

See also  28న ఛలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం రండి.. కదలిరండి : కొలసాని లక్ష్మీ పిలుపు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి