అనారోగ్యంతో బాధపడుతున్న వ్యకికి ఆర్థిక సాయం చేసిన జనసేన నాయకులు గర్భన సత్తిబాబు సహాయం

      పాలకొండ, (జనస్వరం) : పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం పొట్లి గ్రామనికి చెందిన దేబారికి శంకరరావు(35) గత కొంతకాలంగా పూర్తిగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. డాక్టర్స్ సలహామేరకు సర్జిరీ చేసి అతని శరీరం నుండి కొన్ని అవయవాలను కూడా పూర్తిగా తొలగించారు. మరల తదుపరి చికిత్స కోసం ఈమధ్య హాస్పిటల్లో వైద్యులును సంప్రదించగా అతని యొక్క ఆరోగ్యశ్రీ కార్డును పరిశీలించి ఇదివరకే నీ చికిత్స కోసం 3, సందర్భాలలో ఆరోగ్యశ్రీ కార్డు ఉపయోగించునందున నీయొక్క లిమిట్ పూర్తయినది కాబట్టి నీకు ఇంకా ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్సపొందుటకు వీలు పడదని డాక్టర్స్ చెప్పడం జరిగింది. కావున తమ ఆర్థిక పరిస్థితి చూసి స్థానిక పొట్లి గ్రామ జనసైనికులు సహాయ సహకారంతో పాలకొండ నియోజకవర్గ జనసేనపార్టీ నాయకులు గర్భన సత్తిబాబు ఆధ్వర్యంలో 17500/- రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పొట్లి జనసేన నాయకులు ప్రసాద్, శివ, గోవింద్, గోవింద్, పండు, శ్రీను, రాంబాబు, మోహన్, చందు, సోముబాబు తదితరులు పాల్గొన్నారు.

See also  దామలచెరువు పంచాయితీ సమస్యలు పరిష్కరించాలని జనసేన నాయకుల నిరసన

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :