
వారం రోజుల పాటు ఉచిత వైద్య సేవలు – యూనికేర్ హోమియోపతి ప్రత్యేక కార్యక్రమం.
నరసరావుపేట,ఆగస్ట్ 13 ( జనస్వరం)
యూనికేర్ హోమియోపతి సంస్థ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజలకు ప్రత్యేక వైద్య సేవలను అందించేందుకు ముందుకొచ్చింది.ఈ సందర్భంగా యూనికేర్ హోమియోపతి నరసరావుపేట,ఒంగోలు , మిర్యాలగూడ , నల్గొండ బ్రాంచీలలో వారం రోజుల పాటు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. సంస్థ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ పోలోజు శ్రీనివాసాచారి, మేనేజింగ్ డైరెక్టర్ మోడేపల్లి గోపీకృష్ణ చారి,హెడ్ ఆఫ్ డాక్టర్ డా. మదీనా అష్రఫ్ మరియు వారి బృందం ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని యూనికేర్ హోమియోపతి క్లినిక్‌లో ఆగస్టు 20 వరకు ఎలాంటి ఓపీ ఫీజు లేకుండా ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు.అదేవిధంగా ఇతర ఆరోగ్య సేవలపై కూడా 25% నుంచి 50% వరకు ప్రత్యేక రాయితీలు అందిస్తున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు అందుబాటులో ఉన్న హోమియోపతి వైద్య సేవలపై అవగాహన కల్పించడంతో పాటు, అవసరమైన వారికి తక్కువ ఖర్చుతో వైద్యం అందించడమే తమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యూనికేర్ హోమియోపతి యాజమాన్యం కోరింది.
సెల్ : 9553387472








