
ఎచ్చెర్ల ఎస్ ఐ ని అభినందించిన ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి కాంతి శ్రీ గారు
ఎచ్చెర్ల సబ్ ఇన్స్పెక్టర్ రాజేష్ కు అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ‘జీవనరక్షా’పతకానికి ఎంపిక చేసింది. మెళియాపుట్టి పోలీస్ స్టేషన్ లో పనిచేసినప్పడు ఆయన ప్రదర్శించిన ధైర్య సాహసాలను గుర్తించి ఈ అత్యున్నత పతాకానికి ఎంపిక చేశారు. తీత్లి తుఫాను సమయంలో ముగ్గురు ఒడిశా పోలీసులను కాపాడినందుకు ఈ గౌరవం దక్కింది. దీనికి గాను ఎచ్చెర్లపోలీసు స్టేషన్ కు ఎచ్చెర్లనియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి కాంతి శ్రీ గారు స్వయంగా వెళ్లి మరింత ఉన్నత స్థానానికి వెళ్తారు అని అభినందించి, శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు డా,, విశ్వక్షేన్ గారు, ఎచ్చెర్ల నియోజకవర్గ మండల నాయకులు, గురజాడ శ్రీను గారు, కోలా రాజేష్ గారు, బుడతవలస రాజు గారు, లావేరు MPTC అభ్యర్థి రాజా రమేష్ గారు, పాతకుంకాం MPTC అభ్యర్థి దుర్గారావు, కుప్పిలి హరిప్రసాద్ గారు, రణస్థలం కృష్ణాపురం MPTC అభ్యర్థి, పొన్నూరు లక్ష్మునాయుడు, ఎచ్చెర్ల నియోజకవర్గ జనసైనికులు గోవింద్ రెడ్డి, జగదీష్, చిన్న రెడ్డి, మోహన్, జయప్రకాశ్, నాగరాజు, శేఖర్, కాకర్ల బాబాజీ తదితరులు ఉన్నారు.









