డా.సునీల్ శ్రీవల్లి ఇంటర్నేషనల్ హోమియో కేర్ ప్రారంభించిన టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు దరువూరి నాగేశ్వరరావు

ఘనంగా ప్రారంభించిన ‘డా. సునీల్ శ్రీవల్లి ఇంటర్నేషనల్ హోమియో కేర్’ – రెండు రోజుల పాటు ఉచిత వైద్య శిబిరం.

సత్తెనపల్లి,మార్చి 29 (జనస్వరం)

సత్తెనపల్లి పట్టణంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఏర్పాటు చేసిన ‘డా. సునీల్ శ్రీవల్లి ఇంటర్నేషనల్ హోమియో కేర్’ క్లినిక్‌ను ఆదివారం ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ దరువూరి నాగేశ్వరరావు క్లినిక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య ప్రజలకు మెరుగైన హోమియో వైద్యం అందుబాటులోకి రావడం హర్షణీయమని పేర్కొన్నారు.​ఈ ప్రారంభోత్సవం సందర్భంగా ఆదివారం మరియు సోమవారం (రెండు రోజుల పాటు) ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు క్లినిక్ నిర్వాహకులు డాక్టర్ సునీల్ ప్రకటించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.ఈ ​కార్యక్రమంలో గౌరవ అతిథులుగా రోటరీ క్లబ్ జోనల్ చైర్మన్ బెల్లంకొండ నాగ సాయి ప్రసాద్,బీజేపీ టౌన్ అధ్యక్షులు కందకండ్ల శంకర్రావు,నియోజకవర్గ ఇంచార్జి కట్టా శంకర్రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఘంటా విజయ భాస్కర్ రెడ్డి, న్యాయవాది జొన్నలగడ్డ విజయకుమార్, డైట్ లెక్చరర్ మాతంగి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన హోమియోపతి వైద్య సేవలను సత్తెనపల్లి ప్రజలకు చేరువ చేయడమే తమ లక్ష్యమని డాక్టర్ సునీల్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు మరియు వైద్య సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

See also  జనసేన నాయకుడికి ఆర్థిక సాయం అందజేసిన నరసరావుపేట నియోజకవర్గ జనసేన నాయకులు