నేర నియంత్రణయే ప్రథమ కర్తవ్యంగా విస్తృత కార్డెన్ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్న పల్నాడు జిల్లా పోలీస్ అధికారులు

శాంతి భద్రతల పరిరక్షణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలన మరియు నేర నియంత్రణయే ప్రథమ కర్తవ్యంగా విస్తృత కార్డెన్ & సెర్చ్ ఆపరేషన్ లు నిర్వహిస్తున్న పల్నాడు జిల్లా పోలీసులు.

చిలకలూరిపేట, మార్చి 23.( జనస్వరం)

పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఆదేశాల మేరకు ఉదయం నరసరావు పేట సబ్ డివిజన్ చిలకలూరి పేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజీవ నగర్ ఏరియా మరియు ఆది ఆంధ్ర నందు నరసరావుపేట ఇన్చార్జి DSP M. హనుమంత రావు, ట్రైనీ ఐపీఎస్ J.నిరంజన్ ఆధ్వర్యంలో శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు,సామాన్య ప్రజలకు ఇబ్బందులకు గురి చేసే వారిని గుర్తించి ప్రజలకు మేమున్నాము అనే భరోసా కల్పిస్తూ కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్డెన్ & సెర్చ్ కార్యక్రమం నందు పోలీసు అధికారులను మరియు సిబ్బందిని బృందాలుగా విభజించి రౌడీ షీటర్లు,ట్రబుల్ మాంగర్స్,పాత కేసుల లోని నిందితులపై ప్రత్యేక నిఘా ఇళ్లు, పరిసర ప్రాంతాలలో విస్తృత తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీ లలో సంజీవ నగర్ ఏరియా మరియు ఆది ఆంధ్ర నందు సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు – 26,గొడ్డళ్లు – 02,గడ్డ పులుగులు – 05, ధోకుడు పారలు – 02,కొడవలి – 04,స్వాధీనం చేసుకున్నారు. ఫుట్ పెట్రోలింగ్ చేస్తూ సంజీవ నగర్ ఏరియా లోని ప్రజలతో సమావేశం నిర్వహించి ట్రాఫిక్ నియమాలు సైబర్ క్రైమ్ డ్రగ్స్ వంటి నిషేధిత పదార్థాలు మరియు ర్యాగింగ్ వంటి వివిధ అంశాలపై పోలీసు అధికారులు ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. హెల్మెట్ వాడకం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని,మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించి,మాదక ద్రవ్యాల వినియోగం వలన జరిగే అనర్థాల గురించి వివరించి డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు.రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ కార్డన్ సెర్చ్ చేపట్టినట్లు తెలిపారు.
అంతేకాకుండా రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్స్, అనుమానితులు మరియు పాత కేసుల లోని నిందితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాత కేసుల నిందితుల తో సమావేశమై పాత పంథా కొనసాగించకుండా సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. అకారణంగా గొడవలు సృష్టిస్తే సహించేది లేదని,ఏరియాలో ఏ చిన్న సమస్య ఉన్న పోలీసు వారి దృష్టికి తీసుకురావాలని, గొడవలు సృష్టించే వారి మీద జిల్లా ఎస్పీ ఆదేశానుసారం కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

See also  ఘనంగా 100 సంవత్సరాల సి పి ఐ జెండా ఆవిష్కరణ వేడుకలు. పట్టణంలో రెపరెపలాడిన ఎర్ర జెండా,

సంజీవ నగర్ ఏరియా మరియు ఆది ఆంధ్ర నందు జరిగిన కార్డన్ & సెర్చ్ కార్యక్రమంలో నరసరావుపేట ఇన్చార్జి DSP M. హనుమంతరావు,ట్రైని IPS J. నిరంజన్, ట్రైని DSP N. జయకృష్ణ,CI లు,SI లు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.