జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన ఇప్పటం గ్రామ ప్రజలు

     ఇప్పటం, (జనస్వరం) : గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామస్తులు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన చేనేత వికాస విభాగం చైర్మన్ చిల్లపల్లి శ్రీ నివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇప్పటం గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామంలో జనసేన ఆవిర్భావ సభ ద్వారా మా గ్రామానికి జాతీయ స్థాయిలో గుర్తంపు తెచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే జనసేన ట్రస్ట్ ద్వారా 50 లక్షల రూపాయలు మా గ్రామానికి విరాళంగా ఇచ్చినందుకు కృతజ్ఞతగా పవన్ కళ్యాణ్ చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగిందని అన్నారు. అలాగే గ్రామస్తులందరు కమిటీగా ఏర్పడి ఈ నిధులను గ్రామంలోని అభివృది పనులకు కేటాయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తాడేపల్లి మండల అధ్యక్షులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.

See also  కలిస్తేనే కలవరమా... వారాహిపై వస్తే ఏమవుతారో ??? : జనసేన నాయకులు భవానీ రవి శంకర్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :