విమర్శకు ప్రతి విమర్శలు వద్దు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండి : జనసేన నాయకులు రంగస్వామి

రంగస్వామి

      అనంతపురం ( జనస్వరం ) : రాష్ట్రంలో అధికార పార్టీ ప్రతిపక్షాల పార్టీ ఒకరిపై ఒకరు విమర్శలు మాని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని జనసేన పార్టీ మండల జనసేన నాయకులు రంగస్వామి పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని బూతులు తిడుతున్నారు. వైఎస్ఆర్ సీపీ నాయకులు చంద్రబాబు నాయుడు తన అబద్దాలతో బూటకపు హామీలతో మభ్యపెట్టి నువ్వు ఓవర్ డైరెక్షన్ చేస్తూ తెలుగు తమ్ముళ్లను రెచ్చగొట్టే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై అనుచిత అసభ్యకర విమర్శలు చేయించిన చంద్రబాబు నాయుడు పట్టాభి సీఎం జగన్మోహన్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని వైసిపి నాయకులు పేర్కొంటే దాన్ని ప్రతి విమర్శగా గుండాలుగా తెలుగుదేశం నాయకుల ఇళ్లపైన కార్యాలయం పైన వైసిపి నాయకులు దాడులకు పాల్పడడం వైసిపి గుండాయిజంనీకి నిదర్శనం అన్నారు. వైసిపి నాయకులు బెదిరింపులకు దాడులకు ఆస్తుల విధ్వంసాలకు భయపడే ప్రసక్తే లేదని కౌంటర్ ఇచ్చారు. ఇలా ఒకరిపై ఒకరు బురద చల్లే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారని వీటినన్నిటిని ప్రజలు కూడా గమనిస్తున్నారని ప్రజలు కూడా తిరగబడే రోజులు దగ్గర ఉన్నాయి. బిజెపి ఒకరిపై ఒకరు విమర్శించుకోవడం తప్ప రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పై పోరాడటం లేదన్నారు. ప్రజాసమస్యలు ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం కూడా ప్రేక్షక పాత్ర చేసి కాలాన్ని వృధా చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం అన్ని విధాల బాగుండాలంటే ప్రజా సమస్యలపై పోరాడే ఏకైక పార్టీ జనసేన పార్టీ పేర్కొన్నారు. మా నాయకుడు పదవులు ఆశించకుండా ప్రజల కోసం పని చేస్తూ అధికార పార్టీని ప్రశ్నిస్తున్నారని పవన్ కళ్యాణ్ లాంటి నాయకుల తోనే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు.

See also  తక్షణమే ఎతైన వంతెన నిర్మాణ మరమ్మతులు చేపట్టాలి : రాజంపేట జనసేనపార్టీ నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి