అగ్ని ప్రమాదంలో పూరిళ్ళు కాలిపోయిన బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ

అగ్ని ప్రమాదంలో పూరిళ్ళు కాలిపోయిన బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన జనసేన వీరమహిళ శ్రీ కాంతి శ్రీ 

       ఎచ్చెర్ల నియోజకవర్గం లోని రణస్థలం మండలం లో కృష్ణాపురం పంచాయతీ లో గోర్లే పేట గ్రామంలో 16-11-2020 న సోమవారం మధ్యాహ్నం 2:00 గంటలకు కరెంట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించింది. పూరిళ్ళు  దగ్దమయ్యాయి. ఆస్తి నష్టం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీమతి క్రాంతి శ్రీ గారు అగ్ని బాధితులకు పరామర్శించి, వాళ్ళు కుటుంబాలకు నెల సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. శ్రీమతి క్రాంతి శ్రీగారు మాట్లాడుతూ అలాగే ప్రతీ బాధితులకు ప్రభుత్వం ఆదుకోవావలని తెలియజేసారు. ఈకార్యక్రమంలో {శ్రీకాకుళం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు డా.విశ్వక్షేన్ గారు} రణస్థలం MPTC అభ్యర్థి లక్ష్మునాయడు గారు, శంకర్, అప్పలకొండ, పాతకుంకాం MPTC అభ్యర్థి దుర్గరావు, కాకర్ల.బాబాజీ, నికిల్, జయప్రకాశ్, తిరు, సాయి, సురేష్ అలాగే గ్రామ ప్రజలు రణస్థలం మండల జనసైనికులు పాల్గొన్నారు.

 

See also  జనంకోసం జనసేన కార్యక్రమంలో ప్రజల వద్దకు జనసేన నాయకులు వబ్బిన సత్యనారాయణ