జనసేనాని జన్మదిన వారోత్సవాల సందర్భంగా చేనేత కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ

జనసేనాని జన్మదిన వారోత్సవాల సందర్భంగా చేనేత కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ

            జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఎచ్చర్ల  జనసేన పార్టీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ద్వారా చేస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా ఎచ్ఛర్ల పట్టణములో పేద చేనేతకారులకి నిత్యావసర సరుకులు అందించటం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీ కాంతి గారు మాట్లాడుతూ అధ్యక్షుల వారి పిలుపు మేరకు, కరోనా సమయంలో జనసేవ  స్పూర్తితో పట్టణంలో పలు ప్రదేశాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించాము అని, అలాగే పేద చేనేతకారులకి నిత్యావసర సరుకులు అందించామని అన్నారు.  వారికి జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆమె తెలిపారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈ సంవత్సరం ఆయన జన్మదిన వేడుకల్ని నిర్వహిస్తున్నామని, రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు తలపెట్టబోతున్నామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎచ్ఛర్ల జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

See also  రాజంపేటలో జనసేనపార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమము