జనసైనికునికి అండగా నిలిచిన ఆమదాలవలస జనసేన నాయకులు

    ఆమదాలవలస, (జనస్వరం) : ఆమదాలవలస నియోజకవర్గం ఆమదాలవలస మండలం కొర్లకోట గ్రామానికి చెందిన జన సైనికుడు ధవళ సీతారాం ఇటీవల ప్రమాదానికి గురి కావడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న నియోజకవర్గ ఇంచార్జీ పేడాడ రామ్మోహన్ రావు వారిని పరామర్శించి, జనసేన పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అయితే సీతారాం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రారంభించిన ఆ పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కలిగి ఉండటంతో రామ్మోహన్ ఆయా భీమా సంస్థల నుండి జనసేన పార్టీ తరపున 37,520 వేల రూపాయలు విడుదల అయ్యేలా బాధ్యత వహించారు. ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో ఆ కుటుంబానికి వారి గ్రామంలో స్థానికుల సమక్షంలో అందచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జనసేనపార్టీలో ప్రతి కార్యకర్తకు అన్ని వేళల్లో పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమదాలవలస రోటరీ క్లబ్ అధ్యక్షులు పాత్రుని.పాపారావు, పేడాడ హేమలత, SVS పాఠశాల ప్రిన్సిపాల్ ప్రతాప్, అప్పలనాయుడు, సరుబుజ్జిలి జడ్పీటీసీ అభ్యర్థి పైడి. మురళీమోహన్, కార్యకర్తలు, జన సైనికులు పాల్గొన్నారు.

See also  వెల్లంపల్లి శ్రీనివాసరావు సత్తా ప్రభుత్వ భూములు కబ్జా చేయడం వ్యాపారస్తులు దగ్గర దండుకోవడమే

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి