
రైల్వేకోడూరులో ఐసోలేషన్ సెంటర్ ని ఏర్పాటు చేయాలి : జనసేన డిమాండ్
కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం మరియు మండల, పట్టణ పరిధిలో గడిచిన నెల రోజుల్లో కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. రైల్వే కోడూరు జనసేన పార్టీ నాయకుడు ఆంకిపల్లి అఖిల్ ఒక సమావేశంలో మాట్లాడుతూ రైల్వేకోడూరు మండల పరిధిలోని కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, అలాగే కరోనా లక్షణాలు ఉన్న వారిని కూడా సంబంధిత అధికారులు చేసేదేమీ లేక స్వాబ్ టెస్ట్ నిర్వహించి పాజిటివ్ అని నిర్ధారణ అయితే ఇంటినుండి ఇ కడప ఐసోలేషన్ సెంటర్ కు తరలించడం జరుగుతుందని, ఈ విధంగా చేయడం వల్ల ముందుగానే కరోనా లక్షణాలు ఉంటే వారి కుటుంబంలో ప్రతి ఒక్కరికి సోకి వారు కూడా కరోనా బారిన పడిన వారు అవుతారని అలా కాకుండా రైల్వేకోడూరు లోనే ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు చాలా చోట్ల ప్రభుత్వ భవనాలు నిరుపయోగంగా ఉన్నాయని ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేసి కరోనా బాధితులను కడప లేదా తిరుపతికి తరలించకుండా మెరుగైన వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరఫున రైల్వేకోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాస్ గారికి విన్నవించుకుంటూ, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. రైల్వేకోడూరు నియోజకవర్గంలో ఐసోలేషన్ సెంటర్ ను ఏర్పాటు చేసే విషయంపై సత్వరమే సంబంధిత అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నాయకుడు అఖిల్ తెలియజేశారు








