వంశీ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుక్స్ పంపిణీ

    చిత్తూరు ( జనస్వరం ) : ఏర్పేడు మండల రచపాలెం గ్రామంలో వంశీ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ సందర్బంగా బుక్స్  పంపిణీ చేసారు. వంశీ సేవ ట్రస్ట్ కో -ఆర్డినేటర్ వంశీ మాట్లాడుతూ పేదవాళ్ళకి విద్యార్థులకు అన్నివిధాలా సహాయం చేయడమే లక్ష్యం అన్నారు.  నలుగురు స్నేహితులు కలిసి ఏర్పాటు చేసిందే వంశీ సేవ ట్రస్ట్ అన్నారు. మా ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆకలితో ఉన్నావారికి అన్నదానం, కష్టం లో ఉన్న వారికీ ఆర్థిక సహాయం చేయడమే మా లక్ష్యం అన్నారు. 

See also  అంబేద్కర్ జయంతి సందర్భంగా జ్ఞానపురం ప్రాంతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని జనసేన నాయకుల శాంతియుత నిరాహారదీక్ష