అకాల వర్షాల వలన నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్

అకాల

   అమలాపురం ( జనస్వరం ) : అకాల వర్షాల వలన నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని అమలాపురం జనసేన నాయకులు కోరారు. వారు మాట్లాడుతూ తడిసిన, మొలకెత్తిన, రంగు మారిన ధాన్యాన్ని ఆన్ లైన్ లో కాకుండా ఆఫ్ లైన్ కొనుగోలు చెయ్యాలని కోరారు.  జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గం ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు  ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు జిల్లా కలెక్టర్ ను కలిసి విజ్ఞాపనా పత్రాన్ని ఇవ్వడం జరిగింది. దీనిపై కలెక్టర్ స్పందించి తక్షణమే కొనుగోలు చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో  రాష్ర్ట ప్రోగ్రామ్స్ కార్యదర్శి మహాదశ నాగేశ్వరరావు గారు జిల్లా ప్రధాన కార్యదర్శి సందాడి శ్రీనుబాబు, పేరూరు ఎంపిటిసి పనసా బుజ్జి,, సుధా చిన్న, మోకా బాలయోగి, కుంపట్ల వెంకట రమేష్, పొనకల ప్రకాష్, ఆకేటి వెంకన్న, గొలకోటి వెంకటేష్, పినిశెట్టి సురేష్ తదితరులు ఉన్నారు.

See also  ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజల నడ్డి విరుస్తున్న ఏపీ ప్రభుత్వం : చిత్తూరు జనసేనపార్టీ సంయుక్త కార్యదర్శి కీర్తన

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి