
తిరుపతి ( జనస్వరం ) : ప్రజలు కరోనా ప్రభావంతో ఆర్ధికంగా చితికి పోయి, అతి కష్టం మీద బతుకుబండిని లాగుతున్నారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కొద్దిగా మెరుగుపడుతోందని చిత్తూరు జనసేనపార్టీ సంయుక్త కార్యదర్శి కీర్తన అన్నారు. ఆమె పత్రికా ముఖంగా మాట్లాడుతూ ఈ స్థితిలో ప్రజలను ప్రభుత్వాలు ఆదుకోవాలని అలా కాక, ఏపీ ప్రభుత్వం ట్రూఅప్ చార్జీల పేరుతో కరెంట్ బిల్లు పెంచి పెను భారం మోపింది. గత నాలుగు సంవత్సరాలుగా విద్యుత్ సంస్థకి నష్టాలు వచ్చాయని, ఆ నష్టాలను ప్రజల నుంచే వసూలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం, వసూళ్ళకు పూనుకోవడం హేయమైన చర్య. ప్రతి యూనిట్ పైన రూ.1.23 అదనపు భారం, 8 నెలల పాటు వేయబోతున్నారు. దీని వలన సామాన్యులకి, మధ్య తరగతి ప్రజలపై విపరీతంగా భారం పడింది. గతంలో అధిక ఛార్జీలు, డిస్కంలు, పంపిణీ సంస్థలకు అయ్యే అదనపు ఖర్చుల్ని రాష్ట్ర ప్రభుత్వాలు భరించేవి. అలా కాక ఇప్పుడు ఆ భారాన్ని ప్రజలపై వేయడం భావ్యం కాదు. మరియు ప్రజలు చెల్లించే స్థితిలో లేరు. కావున తక్షణమే పెంచిన ట్రూ అప్ ఛార్జీలను ఉపసంహరించి నష్టాన్ని ప్రభుత్వమే భరించాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు.









