యువశక్తి సభకు అశేషంగా తరలి రండి : కుప్పం నియోజకవర్గ జనసేన నాయకులు

      శాంతిపురం, (జనస్వరం) : మన యువత మన భవిత అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నిర్వహిస్తున్న యువశక్తి సభకు జన సైనికులు అశేషంగా తరలిరావాలని కుప్పం నియోజకవర్గ శాంతిపురం మండల జనసేన అధ్యక్షుడు జిఎం కిషోర్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో మండల జనసైనికులతో కలిసి యువశక్తి కార్యక్రమం కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే యువతకు జనసేన పార్టీ ఎప్పుడు అండగా నిలుస్తుందని అలాంటి యువత రాజకీయాల్లోకి రావాలని జనసేన రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు యువత భవిష్యత్తును మార్చేందుకు యువశక్తి కార్యక్రమానికి భారీ సంఖ్యలో హాజరుకావాలని ఆయన కోరారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యకార ప్రధాన కార్యదర్శి వామనమూర్తి, జిల్లా కార్యదర్శి రామమూర్తి,జిల్లా సమీక్ష కార్యదర్శి నవీన్ కుప్పం నియోజకవర్గం మండల ప్రధాన కార్యదర్శి రవి, శ్రీకాంత్, మండల కమిటీ కార్యదర్శి సంపత్, జన సైనికులు బాలకృష్ణ మోహన్ లు పాల్గొన్నారు.

See also  అగ్ని ప్రమాదంలో పూర్తిగా ధగ్నం అయిన కుటుంబాలకు 100 బస్తాల సిమెంట్ మరియు ఆర్థిక సహాయం చేసిన బొలిశెట్టి శ్రీనివాస్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి