మదనపల్లి జిల్లా సాధన JAC ఆధ్వర్యంలో సంతకాల సేకరణ

మదనపల్లి

     మదనపల్లి ( జనస్వరం ) : మదనపల్లి జిల్లా సాధన JAC ఆధ్వర్యంలో మదనపల్లి నియోజకవర్గం ప్రజలు నుండి సంతకాలు సేకరణ కార్యక్రమం చేపట్టడమైనది. ఈ కార్యక్రమానికి చిత్తూరు జనసేనపార్టీ ప్రధాన కార్యదర్శి దారం అనిత పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో మదనపల్లిని జిల్లా చేసేదాకా ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామని అన్నారు. అన్ని విధాలుగా అనుకూలంగా వున్న మదనపల్లిని జిల్లా చేయాలని కోరారు. ఈ విషయం గురించి ప్రభుత్వ సరైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి మదనపల్లి జిల్లా సాధన JAC సభ్యులు, జనసేన, వివిధ రాజకీయ పార్టీలు, కుల సంఘాలు నాయకులు పాల్గొన్నారు.

See also  జనసేనపార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో గాయపడ్డ మహిళకు ఆర్థిక సాయం చేసిన అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి వరుణ్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి