
ధర్మవరం ( జనస్వరం ) : సేవ్ ధర్మవరం కార్యక్రమంలో భాగంగా 23వ రోజు 35వ వార్డు లక్ష్మీ నగర్ లో నిర్వహిస్తూ, ఇంటింటా తిరుగుతూ, ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి ప్రజలు వీధి దీపాలు, పెన్షన్, డ్రైనేజీ తదితర సమస్యలను విన్నవించుకున్నారు. ఇల్లు లేని వారు తమకు ఇంటి పట్టాలు ఇప్పించాలని వారు కోరారు. అనంతరం చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి వార్డుకు తగిన న్యాయమును చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్సిపి పాలనపై విసుకు చెందారని, దాడులు, బెదిరింపులు ఇక సాగవని వారు తెలిపారు. నిత్యావసర ధరలతో పాటు డీజిల్ పెట్రోల్ ధరలు అధికం కావడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు జనసేన పార్టీకి పట్టం కట్టబోతున్నారని, రాష్ట్ర ప్రజల సమస్యలు తప్పక తీర్చే దిశలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నడుము కట్టారని భరోసా ఇచ్చారు. చేనేత కార్మికులను అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకోవడంలో విఫలం చెందిందని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడం స్పష్టమని, ప్రజల కష్టాలను సమస్యలను తప్పక తీరుస్తామని భరోసా ఇచ్చారు.








