ఉత్తరాంధ్ర జనసేన ఆలయ పరిరక్షణ కమిటీల ఏర్పాటు నియామక పత్రాలను అందించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు

జనసేన

                విశాఖపట్నం ( జనస్వరం ) :  జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్ ఆదేశాల మేరకు గురువారం ఆలయ పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేశారు. మాధవధార వుడా కాలనీలోని పార్టీ ఉత్తరాంధ్ర కార్యాలయంలో కొత్త కమిటీ సభ్యులను నియమించి ఉత్తర్వులను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బొలిశెట్టి సత్య, టి.శివశంకర్‌, నాయకులు భాస్కర్‌ల చేతుల మీదుగా అందజేశారు. సింహాచలం దేవస్థానం, వన్‌టౌన్‌ కనకమహాలక్ష్మి తదితర మందిరాలకు కమిటీ సభ్యులను నియమించారు. ఒక్కో మందిరానికి ఒక్కొక్కరినీ షాడో కమిటీల పేరుతో నియామక పత్రాలు అందించారు. ఆలయాలకు సంబంధించిన నిబంధనలకు వ్యతిరేకంగా చర్యలు, లొసుగులపై ఈ కమిటీలు పోరాడనున్నాయి. కమిటీ సభ్యులంతా బాధ్యతలకు లోబడి పనిచేయాలని నాయకులు సూచించారు.

See also  పనపాకంలో వైఎస్సార్సీపీ నాయకునికి అండగా జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి