రహదారి నిర్మాణం పూర్తి చేయాలని తహసీల్దార్‌కు వినతిపత్రం అందించిన చెన్నేకొత్తపల్లి జనసేన నాయకులు

చెన్నేకొత్తపల్లి

    చెన్నేకొత్తపల్లి, (జనస్వరం) : చెన్నేకొత్తపల్లి మండలంలోని నాగసముద్రం గ్రామానికి వెళ్లే రహదారి నిర్మాణం పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టాలని జనసేన కార్యకర్తలు స్పందన కార్యక్రమంలో తహసీల్చార్‌ నాగేంద్రకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు క్రాంతికుమార్‌, అమర్‌ మాట్లాడుతూ ఆరు సంవత్సరాలు క్రితం రహదారి పనులు చేపట్టారని, నేటికి పూర్తికాలేదన్నారు. చెరువు కట్ట నుంచి లీకయ్యే నీటి వల్ల దారిపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడి ప్రయాణానికి వీల్లేకుండా ఉందని వాపోయారు. గ్రామస్తులు చెరువుకట్టపై ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారన్నారు. రహదారి నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని వారు తహసీల్దార్‌ను కోరారు. ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకుపోయి, పరిష్కారానికి కృషిచేస్తానని తహసీల్దార్‌ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమములో  జనసేన నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితురులు పాల్గొన్నారు.

See also  అనారోగ్యముతో బాధపడుతున్న మహిళకు ఆర్థిక సహాయం అందించిన చిత్తూరు జిల్లా జనసేనపార్టీ ప్రధాన కార్యదర్శి దారం అనిత