
హైదరాబాద్, ఫిబ్రవరి 12, (జనస్వరం) : మన శంకర వరప్రసాద్ చిత్రం ఘనవిజయం సాధించిన సందర్భంగా జనసేన పార్టీ మండల అధ్యక్షుడు చక్రవర్తి (చక్రి) పద్మవిభూషణ్ కొణిదల చిరంజీవిని హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చిత్ర విజయంపై అభినందనలు తెలియజేశారు. అలాగే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతూ, మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమం అనంతరం చక్రవర్తి మాట్లాడుతూ చిరంజీవి సేవా కార్యక్రమాలు, సినీ సేవలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.








