ల్యాండ్ పూలింగ్ పేరుతో పేదల స్థలాల సేకరణను అడ్డుకున్న జనసేన నాయకులపై కేసులు

ల్యాండ్ పూలింగ్ పేరుతో పేదల స్థలాల సేకరణను అడ్డుకున్న జనసేన నాయకులపై కేసులు

             నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం , కొడవలూరు మండలం , కొడవలూరు అరుంధతీవాడ కుటుంబాలకు సంబంధించిన  ఇళ్ళ స్థలాలను ల్యాండ్ పూలింగ్ పేరుతో వైయస్సార్ సీపీ నాయకులు మరియు కొడవలూరు రెవిన్యూ అధికారులు అన్యాయంగా దళితుల భూములను ఆక్రమించి అధికార పార్టీ నాయకులకు , అధికారపార్టీ కార్యకర్తలకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ నెల్లూరు జిల్లా జనసేనపార్టీ యువజనవిభాగం అధ్యక్షుడు గునుకుల కిషోర్ మరియు జనసేనపార్టీ వీరమహిళ చెంబేటి ఉష గారు అరుంధతీవాడ గ్రామస్తులతో కలసి రెవిన్యూ అధికారులను అడ్డుకోవడం జరిగింది. పేదలకు అండగా ఉంటూ వాళ్ళ యోగ క్షేమాలు చూసుకోవాల్సిన ప్రభుత్వాలు , ప్రభుత్వ అధికారులు దళితులపైన , జనసేనపార్టీ నాయకులపైన కక్ష సాధింపు దోరణితో జనసేన నాయకులు గునుకుల కిషోర్ గారిమీద , జనసేన నాయకురాలు చెంబేటి ఉష గారిమీద , కొడవలూరు అరుంధతీవాడ ప్రజలమీద అధికారపార్టీ నాయకుల ప్రోద్బలంతో కొడవలూరు రెవిన్యూ అధికారులు ఈరోజు కొడవలూరు పోలీసు స్టేషన్ లో కేసు నమోదుచేయడం జరిగింది. పేదవాళ్ళ కోసం జనసేనపార్టీ న్యాయపోరాటం చేస్తుంటే, అధికారపార్టీ మాత్రం పేదల కడుపు మీద , వారి కష్టాలమీద కొడుతూ లబ్దిపొందుతున్నారు. ఇలాంటి భూటకపు అరెస్ట్ లు జనసేనని భయపెట్టలేవని, బాధితులకు న్యాయం జరిగేవరకు జనసేన పోరాటం ఆగదని అన్నారు. న్యాయపరంగా పోరాటం చేసి బాధితులకు న్యాయం జరిగేలా చేస్తామని నెల్లూరు జిల్లా జనసేన నాయకులు గునుకుల కిషోర్ బాధితులకు హామీ ఇవ్వడం జరిగింది.

See also  జగ్గంపేట నియోజకవర్గంలో పాటంశెట్టి సూర్యచంద్ర ఆధ్వర్యంలో జనసేనలో చేరికలు