మృత్యుఘోష వినబడదా? జనసేన పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర, మద్దతు తెలిపిన బీజేపీ

మృత్యుఘోష వినబడదా? జనసేన పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర, మద్దతు తెలిపిన బీజేపీ

                నిత్యం రోడ్డు ప్రమాదాలతో ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని జనసేన, బీజేపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పెందుర్తి నుంచి ఎస్.కోట వరకు రహదారి విస్తరణ, అభివృద్ధి కోరుతూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం పాదయాత్ర చేపట్టారు. బీజేపీ శ్రేణులు పాల్గొని మద్దతు తెలిపారు. జిల్లా సరిహద్దు చింతలపాలెం నుంచి కొత్తవలస (సుమారు 6 కిలోమీటర్లు మేర ) జంక్షన్ వరకు పాదయాత్ర చేశారు. కొత్తవలస జంక్షన్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జనసేన నియోజకవర్గం నాయకులు వబ్బినసన్యాసి నాయుడు, వబ్బిన సత్తిబాబు, బీజేపీ నియోజకవర్గ ఇంచార్జీ సె.హెచ్.అర్.కె.ప్రసాద్, కొత్తవలస అధ్యక్షుడు సి.హెచ్.అప్పారావు మాట్లాడారు. కొత్తవలస – పెందుర్తి మధ్య రహదారి పూర్తిగా పాడవడంతో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ కూడా పెరగడంతో రోడ్డెక్కాలంటే ప్రజలు భయపడుతున్నారన్నారు. ఈ రహదారిని అభివృద్ధి చేస్తే విద్య, వాణిజ్య, పారిశ్రామిక, పర్యాటకంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెందుతున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి నాలుగు వరుసల రహదారిగా (డబుల్ రోడ్డు) అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ప్రజలను సమాయత్తం చేసి పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. పాదయాత్రలో జనసైనికులు, బీజేపీ కేడర్ ఉత్సాహంగా పాల్గొనారు. ప్రజల నుంచీ భారీ మద్దతు లభించింది. నిరసన ర్యాలీని ఆయా గ్రామాల ప్రజలు స్వాగతించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు రామేళ్ల శివాజీ, వబ్బిన సతీష్, గొరపల్లి రవికుమార్,సుంకరి అప్పారావు, ఎం.శ్రీను, జె.సత్తిబాబు, రావాడ నాయుడు, నక్కరాజు సతీష్, మళ్ల రాజు, కన్నాజీ, వెంకటేష్,పులిబంటి సంతోష్, విజయ్ కుమార్, డి.రాజు జనసైనికులు, బీజేపీ నాయకులు మాన్యం దేముడు, రూపేష్, యలమంచిలి ప్రసాద్ పాల్గొన్నారు.

See also  ప్రజల సమస్యలు పరిష్కరించడం జనసేన కార్యకర్త లక్ష్యం : జనసేన నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖరరావు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి