Logo
Date of Publish : 16 November 2020, 4:11 pm
Editor : Sake Naresh

మృత్యుఘోష వినబడదా? జనసేన పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర, మద్దతు తెలిపిన బీజేపీ

మృత్యుఘోష వినబడదా? జనసేన పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర, మద్దతు తెలిపిన బీజేపీ

                నిత్యం రోడ్డు ప్రమాదాలతో ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని జనసేన, బీజేపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పెందుర్తి నుంచి ఎస్.కోట వరకు రహదారి విస్తరణ, అభివృద్ధి కోరుతూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం పాదయాత్ర చేపట్టారు. బీజేపీ శ్రేణులు పాల్గొని మద్దతు తెలిపారు. జిల్లా సరిహద్దు చింతలపాలెం నుంచి కొత్తవలస (సుమారు 6 కిలోమీటర్లు మేర ) జంక్షన్ వరకు పాదయాత్ర చేశారు. కొత్తవలస జంక్షన్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జనసేన నియోజకవర్గం నాయకులు వబ్బినసన్యాసి నాయుడు, వబ్బిన సత్తిబాబు, బీజేపీ నియోజకవర్గ ఇంచార్జీ సె.హెచ్.అర్.కె.ప్రసాద్, కొత్తవలస అధ్యక్షుడు సి.హెచ్.అప్పారావు మాట్లాడారు. కొత్తవలస - పెందుర్తి మధ్య రహదారి పూర్తిగా పాడవడంతో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ కూడా పెరగడంతో రోడ్డెక్కాలంటే ప్రజలు భయపడుతున్నారన్నారు. ఈ రహదారిని అభివృద్ధి చేస్తే విద్య, వాణిజ్య, పారిశ్రామిక, పర్యాటకంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెందుతున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి నాలుగు వరుసల రహదారిగా (డబుల్ రోడ్డు) అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ప్రజలను సమాయత్తం చేసి పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. పాదయాత్రలో జనసైనికులు, బీజేపీ కేడర్ ఉత్సాహంగా పాల్గొనారు. ప్రజల నుంచీ భారీ మద్దతు లభించింది. నిరసన ర్యాలీని ఆయా గ్రామాల ప్రజలు స్వాగతించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు రామేళ్ల శివాజీ, వబ్బిన సతీష్, గొరపల్లి రవికుమార్,సుంకరి అప్పారావు, ఎం.శ్రీను, జె.సత్తిబాబు, రావాడ నాయుడు, నక్కరాజు సతీష్, మళ్ల రాజు, కన్నాజీ, వెంకటేష్,పులిబంటి సంతోష్, విజయ్ కుమార్, డి.రాజు జనసైనికులు, బీజేపీ నాయకులు మాన్యం దేముడు, రూపేష్, యలమంచిలి ప్రసాద్ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com