
తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవ సందర్భంగా మిట్టగుడెంలో జనసైనికుల ఆధ్వర్యంలో కేకు కటింగ్
పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్బంగా తెలంగాణలోని మిట్టగూడెం గ్రామంలో జనసైనికుడు జగన్ గారి ఆధ్వర్యంలో మిట్టగూడెం సెంటర్ వద్ద కేక్ కట్ చేశారు. అనంతరం గ్రామాల్లో జనసైనికులు కరోనా గురించి వివరిస్తూ, కరోనా గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. జనసేన నాయకుడు జగన్ మాట్లాడుతూ జనసేనానికి 49 వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జనసేనాని ఆశయ సాధనలో భాగంగా తన జన్మదిన శుభసందర్భంగా కేకులు కట్ చేసి, వివిధ సామాజిక కార్యాక్రమాలు చెప్పట్టడం జరిగిందని, తాము ఎల్లప్పుడూ జనసేనాని ఆశయ సాధనలో నడుస్తామని అన్నారు. ఈ ఈ కార్యక్రమం లో జనసేన నాయకులు కణితి మహేష్ , అజ్మీరా కిషన్, పాండ్రు దిలీప్, ఎన్న కౌశిక్, షేక్ మాలిక్, శెట్టిపల్లి సంజయ్ మరియు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పాల్గొన్నారు.








