భీమిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో 73 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

    భీమిలి, (జనస్వరం) : భీమిలీ నియోజకవర్గం జనసేనపార్టీ ఆఫీసులో 73 వ, గణతంత్ర దినోత్సవ వేడుకలు డా” సందీప్ పంచకర్ల గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా డా” సందీప్ పంచకర్ల గారు మాట్లాడుతూ, ముందుగా 1950 జనవరి 26న రాజ్యాంగ అమలు రావడానికి కారణమైన మహాత్ములు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. స్వాతంత్ర్యం రావడానికి రాజ్యాంగం అమలులోకి తీసుకొచ్చిన మహానుభావుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి అడుగుజాడల్లో మనం నడుద్దాం అని భవిష్యత్ భారతాన్ని సువర్ణ అక్షరాలతో లిఖిద్దాం అని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ విశాఖ జిల్లా నాయకులు బీవీ కృష్ణయ్య, శ్రీను బాబు, భీమిలి నియోజకవర్గం నాయకులు సంతోష్ నాయుడు, యడ్ల గణేష్ యాదవ్, నాగోతి నాయుడు, సత్యనారాయణ, కొర్రాయి అనిల్, పిల్లా శ్రీను తదితరులు పాల్గొన్నారు.

See also  తెరపల్లి, పెడబరడా గ్రామ జనసైనికుల ఆత్మీయ సమావేశం