
పుట్టపర్తి, అక్టోబర్ 19, (జనస్వరం) : శ్రీ సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాలలో పాల్గొనడానికి విచ్చేసిన జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కల్యాణ్‌ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు జనసేన నేత భవానీ రవికుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీ సత్య సాయిబాబా శత జయంతి వేడుకలకు భారీగా జనసంద్రం తరలిరాగా, ప్రముఖ నాయకుల రాకతో పుట్టపర్తి ప్రాంతం సందడిగా మారింది. ఈ సందర్బంగా భవానీ రవికుమార్ పవన్ కల్యాణ్‌ను ఆత్మీయంగా పలకరించి శత జయంతి కార్యక్రమాలపై వివరాలు పంచుకున్నారు.








