దివ్యాంగులకు వ్యాక్సిన్ ఇంటి వద్దకే ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్న బాపట్ల దివ్యాంగ జనసైనికుడు

               బాపట్ల జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో గంటలనుండి 12 గంటల వరకు బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలోనిరసన చేయడమైనది. ఈ నిరసన ముఖ్య ఉద్దేశం కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉన్నది కావున కోవిడ్ వ్యాక్సిన్  రాష్ట్రంలోని దివ్యాంగుల ఇంటివద్దకే ఇవ్వాలని కోరారు.  ప్రస్తుతం వ్యాక్సిన్ సామాన్య ప్రజలకే అందడం లేదు. ఇక మాలాంటి దివ్యాంగుల పరిస్థితి ఏంటి అని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ కోసం ఆన్లైన్ లో ముందుగా బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి. కానీ, దివ్యాంగులు ఎలా ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలో తెలియక అవస్థలు పడుతున్నారన్నారు.  జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ప్రభుత్వం దివ్యాంగులకు సరైన వసతులు కల్పించాలని కోరారు. వారికి ఫించన్ తో పాటు కాస్తా ఆర్థిక సహాకారం అందించాలని కోరారు. 

See also  పవన్ కళ్యాణ్ పై వైసీపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన రాజంపేట జనసేన నాయకులు బాల సాయి కృష్ణ

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి