
– సారపాక ప్రగతి పాఠశాల విద్యార్థి అద్భుత విజయం, తల్లిదండ్రులను కూడా అభినందన
సారపాక, మార్చి 20 (జనస్వరం) : నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాలు ఈ నెల 17న విడుదలైన సందర్భంలో, అఖిల భారత స్థాయిలో 4వ ర్యాంక్ సాధించిన విద్యార్థి బర్ల అయాన్ వేదిక్ (తండ్రి: బర్ల రామకృష్ణ, తల్లి: విజయలక్ష్మి) గాంధీనగర్, సారపాకకు చెందిన వందనీయ విద్యార్థిగా నిలిచారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని ప్రగతి పాఠశాల కరెస్పాండెంట్ సానికొమ్ము చైతన్య ఆధ్వర్యంలో అయాన్ వేదిక్‌కు ఘన సన్మానం పలికారు. చైతన్య మాట్లాడుతూ, “ఆయాన్ వేదిక్ కృషి, పట్టుదలతో విజయం సాధించాడు. అతని విజయానికి తోడ్పడిన తల్లిదండ్రులను కూడా అభినందిస్తున్నాం. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశీర్వదిస్తున్నాం” అని తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మి ప్రసన్న మాట్లాడుతూ, “అయాన్ ఎల్లప్పుడూ చదువులో ప్రతిభ చూపించే విద్యార్థి. ఈ విజయం అతని కుటుంబం, పాఠశాల, సమాజానికి గౌరవాన్ని తెచ్చింది. నవోదయ పాఠశాలలో చదవడం గొప్ప అవకాశం, నా అనుభవాలను పంచుకోవడం సంతోషంగా ఉంది” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అయాన్ వేదిక్, తల్లిదండ్రులను బుకేలు, శాలువాలు, మెమెంటోలుతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.








