Logo
Date of Publish : 21 March 2026, 8:24 am
Editor : Sake Naresh

అఖిల భారత స్థాయిలో 4వ ర్యాంక్ సాధించిన అయాన్ వేదిక్‌కి ఘన సన్మానం

- సారపాక ప్రగతి పాఠశాల విద్యార్థి అద్భుత విజయం, తల్లిదండ్రులను కూడా అభినందన

సారపాక, మార్చి 20 (జనస్వరం) : నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాలు ఈ నెల 17న విడుదలైన సందర్భంలో, అఖిల భారత స్థాయిలో 4వ ర్యాంక్ సాధించిన విద్యార్థి బర్ల అయాన్ వేదిక్ (తండ్రి: బర్ల రామకృష్ణ, తల్లి: విజయలక్ష్మి) గాంధీనగర్, సారపాకకు చెందిన వందనీయ విద్యార్థిగా నిలిచారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని ప్రగతి పాఠశాల కరెస్పాండెంట్ సానికొమ్ము చైతన్య ఆధ్వర్యంలో అయాన్ వేదిక్‌కు ఘన సన్మానం పలికారు. చైతన్య మాట్లాడుతూ, “ఆయాన్ వేదిక్ కృషి, పట్టుదలతో విజయం సాధించాడు. అతని విజయానికి తోడ్పడిన తల్లిదండ్రులను కూడా అభినందిస్తున్నాం. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశీర్వదిస్తున్నాం” అని తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మి ప్రసన్న మాట్లాడుతూ, “అయాన్ ఎల్లప్పుడూ చదువులో ప్రతిభ చూపించే విద్యార్థి. ఈ విజయం అతని కుటుంబం, పాఠశాల, సమాజానికి గౌరవాన్ని తెచ్చింది. నవోదయ పాఠశాలలో చదవడం గొప్ప అవకాశం, నా అనుభవాలను పంచుకోవడం సంతోషంగా ఉంది” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అయాన్ వేదిక్, తల్లిదండ్రులను బుకేలు, శాలువాలు, మెమెంటోలుతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com