జనసేనపార్టీ నాయకుల చొరవతో విద్యార్థులకు బస్సును ఏర్పాటు చేసిన అనంతపురం RTC అధికారులు

     శింగనమల, (జనస్వరం) : అనంతపురం జిల్లాలో  గతంలో శింగనమల జనసేన  పార్టీ ఆధ్వర్యంలో శింగనమల మండలం లోని నాగుల గుడ్డం తండా, నాగుల గుడ్డం, వెస్ట్ నరసాపురం గురుగుంట్ల, చిన్న జనాల పురం గ్రామాల విద్యార్థులు పాఠశాలకు రావడానికి బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న విషయమై శింగనమల నియోజకవర్గ నాయకులు సాకే మురళీకృష్ణ గారు జోనల్ చైర్మన్ మంజుల గారికి, ఆర్ఎం గారికి వినతి పత్రం ద్వారా విషయం తెలియజేయడం జరిగింది. ఇందుకు స్పందించిన ఆర్టీసీ జోనల్ చైర్మన్ మంజుల గారు, ఆర్ఎం గారు బస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీ జోనల్ చైర్మన్ మంజుల గారు, ఆర్టీసీ ఆర్ఎం, జనసేన నాయకులు సాకే మురళీకృష్ణలు కలసి రిబ్బన్ కటింగ్ చేసి బస్సును ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శింగనమల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు పురుషోత్తం రెడ్డి, ఓబిలేస్,పెద్దిరాజు, రామంజి నాయక్‌, మధు, గజేంద్ర నాయక్, సంజీవులు తదితరులు పాల్గొన్నారు.

See also  అంగన్ వాడి పోస్టుల్లో అవకతవకలు, సమస్యను పరిష్కరించకపోతే జనసేన పోరాటం చేస్తుంది : నలిశెట్టి శ్రీధర్