వికృతమాలలో ముగిసిన వైకుంఠ ద్వార దర్శనం

వికృతమాల

    తిరుపతి ( జనస్వరం ) :  వికృతమాల శ్రీ సంతాన సంపద వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం ఆదివారంతో ముగిసింది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో దాదాపు 40 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్టు ఆలయ ధర్మకర్త డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. ఈ రెండు రోజుల పాటు స్వామి దర్శనం చేసుకున్న భక్తులకు తీర్ధప్రసాదాలను అందజేశారు. ఆలయంలో సామాన్య భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఆదివారం తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ సహా పలువురు రాజకీయ, అధికార ప్రముఖులు స్వామి వారిని దర్శించుకున్నారు.

See also  5 కోట్లకి చెరువు మట్టి అమ్ముకుని రోడ్డు వేయని మధుసూధన్ రెడ్డి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి