ఆసరాలేని వృద్ధుల కోసం మండల కేంద్రాల్లో ఆనంద ఆశ్రమాలు

      జగ్గంపేట ( జనస్వరం ) : జనం కోసం జనసేన 729వ రోజులో భాగంగా జగ్గంపేట మండలం వెంగయ్యమ్మపురం గ్రామంలో జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ఇంటింటికీ తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న క్రమంలో నిరుపేదరాలైన ఒక వృద్ధురాలిని చూసి చలించిపోయారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గం మొత్తంగా చాలా గ్రామాలలో ఎవరి ఆసరా లేక ఇలాంటి అవస్థలు పడుతున్న నిరుపేదలైన వృద్దులు అనేక మంది ఉన్నారని అన్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలిచిన వెంటనే జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలలో ఇలాంటి నిరుపేదలైన వృద్ధుల కోసం అన్ని రకాల సదుపాయాలతో ఆనంద ఆశ్రమాలు నిర్మించి జనసైనికులు అంతా వారికి ఒక బిడ్డలలాగా అండగా నిలబడతామని అన్నారు.

See also  పొత్తులపై పవన్ మాట్లాడితే వైసీపీకి తడిచిపోతున్నాయి : మైఫోర్స్ మహేష్