ప్రమాదంలో గాయపడిన జనసైనికుడిని పరామర్శించిన అనకాపల్లి జనసేన నాయకులు

     అనకాపల్లి, (జనస్వరం) : ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి నియోజకవర్గం కశింకోట మండలం జమాదులపాలెం గ్రామంలోని ప్రమాదవశాత్తు గాయపడిన జనసైనికుడిని అనకాపల్లి జనసేన పార్టీ పరుచూరి భాస్కరరావు ఆదేశాల మేరకు బాధితుడిని కలిసి పరామర్శించి ప్రమాదం జరిగిన తీరు, ప్రస్తుత స్థితి గురించి ఆరా తీయడం జరిగినది. ప్రస్తుత పరిస్థితి ఆశాజనకంగా లేనట్టుగా నడుము కింద భాగం మొత్తం అచలన స్థితిలో ఉన్నట్లు కుమార్తె వివరించింది. జనసైనికుల ఔదార్యం చూసి కన్నీళ్లు పెట్టుకున్న క్రియాశీలక సభ్యుడు అట్టా నూకరాముకి దైర్యం చెబుతూ అన్ని విధాలా పార్టీ, జనసైనికులు అండగా ఉంటామని భరోసా ఇచ్చి ప్రస్తుత ఖర్చుల నిమిత్తం వెయ్యి రూపాయలు ఇచ్చి, మరింత ఆర్ధికంగా సహాయపడేందుకు కమిటీ సభ్యులందరితో మాట్లాడి త్వరలోనే కలుస్తామని హామీ ఇచ్చి, ఏ ఇబ్బందిగా అనిపించినా వెంటనే సమాచారం అందించిన వెంటనే స్పందిస్తామని తెలిపి దైర్యంగా ఉండాలని కోరాము. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జనసేన పార్టీ కోర్ కమిటీ సభ్యులు గూడెపు మణికంఠతో పాటుగా జనసైనికులు గెంజి హేమంత్, గొన్న శివ అప్పారావు (చంటి ), పడాల యస్వంత్, బొద్దపు శివ, గ్రామ జనసేన పార్టీ కమిటీ ఉపాధ్యక్షులు గూడుపు చిన్నారావు, అధ్యక్షులు కరణం శివకుమార్, ప్రధాన కార్యదర్శి శనివాడ లక్ష్మి (వీరమహిళ) తదితరులు పాల్గొన్నారు.

See also  కుప్పంలోని ప్రధాన సమస్యలను జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ గారి దృష్టికి తీసుకెళ్లిన స్థానిక జనసేన నాయకులు