
ఆకువీడులో జనసేన – బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణం కోసం పాదయాత్ర చేసిన కార్యకర్తలు
పశ్చిమగోదావరి జిల్లా ఉండి ఈ రోజు ఆకివీడు మండల జనసేన బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో గుమ్ములూరు శివారు నుంచి చినకాపవరం పెదకాపవరం మీదుగా క్రొవ్విడి వరకు రోడ్డు నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర చేయడం జరిగింది. అనంతరం రోడ్డు సమస్యల్ని వెంటనే పరిష్కరించాలి అని కోరుతూ స్థానిక ఎమ్మార్వో మరియు ఎండివో కార్యాలయాల్లో ఆకివీడు మండల జనసేన బీజేపీ పార్టీల తరపున వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అధికారులు నాయకులు ఇప్పటికైనా మేలుకొని ప్రజల రోడ్డు సమస్యల్ని పరిష్కరించాలని జనసేన బీజేపీ పార్టీల తరపున డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు. ఈ రోడ్డు సమస్యను వీలయినంత తొందరలో పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున నిరసన, ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జనసేన నాయకులకు మరియు జనసైనికులకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.








