
గుంతకల్లు, (జనస్వరం) : అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలో జనసేన పార్టీ కోసం పని చేసే ప్రతి జనసైనికుడు క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకోవాలి. అలాగే పార్టీ బలోపేతం దిశగా అడుగులు అడుగులు వేయాలి అనే ఉద్దేశంతో భీమ్లా నాయక్ చిత్రం ప్రదర్శించబడుతున్న చైతన్య థియేటర్ దగ్గర అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి శ్రీ వాసగిరి మణికంఠ గారి సహకారంతో క్రియాశీలక సభ్యత్వం గోడ పత్రికలు, కరపత్రాలును జనసేన నాయకులు పంచడం జరిగింది. ప్రతి ఒక్క అభిమానికి, జనసైనికులకు క్రియాశీలక సభ్యత్వం గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాయిధరమ్ తేజ్ యువత అధ్యక్షులు పవర్ శేఖర్, గుంతకల్ జనసేన మండల అధ్యక్షుడు కురువ పురుషోత్తం, 13 వార్డ్ ఇంచార్జ్ బండి శేఖర్, పూల ఎర్రిస్వామి, పాండు కుమార్, ఎస్ కృష్ణ, రమేష్ రాజ్, సూర్యనారాయణ, తిమ్మాపురం శివ, దాదా తదితరులు పాల్గొన్నారు.








