
ఆగనంపూడిలో అబ్దుల్ కలాం జన్మదిన వేడుకలు
భారతమాత ముద్దుబిడ్డ భారతరత్న, మిస్సైల్ మ్యాన్, పీపుల్స్ ప్రెసిడెంట్, శ్రీ స్వర్గీయ డా౹౹ అబ్దుల్ కలాం గారి 89వ జయంతి ని పురస్కరించుకుని అగనంపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు అబ్దుల్ కలాం గారి విగ్రహంకి అగనంపూడి జనసైనికులు నివాళిలు అర్పించటం జరిగింది. కార్యక్రమంలో జనసేన నాయకులు మోటూరి వెంకటరమణ గారు, మంత్రి మురళీ గారు, విందుల నారాయణరావు గారు మరియు జనసైనికులు మేడశెట్టి విజయ్, తలారి సన్యసిరావు,జె రమణ, దాసరి శ్రీను,చిత్తా లక్ష్మణ్, అట్టా శ్రీనివాసరావు, రవితేజ, శ్రీను, హరీష్ , నరేష్ పాల్గొనటం జరిగింది.









