సోము వీర్రాజు ఆధ్వర్యంలో పాలకొండ జనసేన నాయకులు ఆత్మీయ సమావేశం

     పాలకొండ, (జనస్వరం) : ఆంధ్ర రాష్ట్ర బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు పట్టభద్రుల ఎలక్షన్ నిమిత్తం ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో శ్రీ శ్రీనివాస కళ్యాణ మండపంలో నియోజకవర్గ బిజెపి నాయకులతో సమావేశంలో భాగంగా జనసేనపార్టీ పాలకొండ నియోజకవర్గ నాయకులు గర్భాన సత్తిబాబు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించడం జరిగింది. సత్తిబాబు ఆహ్వానం మేరకు స్థానికంగా ఉన్న జనసేనపార్టీ కార్యాలయంకు సోమువీర్రాజు రావడం జరిగింది. ఈ సందర్భంగా ఇరు వర్గాల నాయకులతో రాబోయే ఎలక్షన్ గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

See also  ఒక్క ఛాన్స్ ఇవ్వమంటారు... ఇచ్చాక మీ కోసం నిలబడరు - శ్రీ పవన్ కల్యాణ్ గారు...