
హీర మండలంలోని రిక్షా కార్మికుల పోరాటానికి జనసేన పార్టీ అండగా
శ్రీకాకుళం హీర మండలంలోని రిక్షా కార్మికుల కష్టాలు తమ ఆవేదనలు హీరమండలంలో జనసేన పార్టీ నాయుకుల దృష్టికి తీసుకొచ్చారు. ఇదివరకే తమ కష్టాలు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళిన పట్టించుకోలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి స్పందిస్తూ సుమారు 80 కి పైగా రిక్షా కార్మికులతో కలిసి ర్యాలీగా వెళ్ళి మండల MR0 గారికి వినతి పత్రం అందివ్వడం జరిగింది. ఈ YCP ప్రభుత్వం ఉచిత పథకాలు అని YCP నాయుకులుకు ఆదాయం తెచ్చి పెట్టే పథకాలు ఎన్నో ప్రవేశ పెట్టింది. కానీ, తమ రక్తం చిందించి అతి కష్టంగా కుటుంబాలను నెట్టుకొస్తున్న ఈ రిక్షా కార్మికులను మాత్రం మరిచిపోయింది అంటూ మీ సమస్య మా అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి రిక్షా కార్మికులను ఆదుకొనే విధంగా కృషి చేస్తాం అని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయుకులు కొండాడ.సురేష్, తిరుపతి యుగంధర్ లు పాల్గొన్నారు.









