గజపతినగరంలో జనసేనాని జన్మదిన వేడుకల్లో భాగంగా ఉచిత మెగా వైద్యా శిబిరం ఏర్పాటు

గజపతినగరం

        గజపతినగరం ( జనస్వరం ) : మెగా వైద్య శిబిరం మరుపల్లి గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. పీజిస్టార్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో జనరల్ ఫిజీషియన్ ఆర్థోపెటిక్ వైద్యులచే వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఉచితంగా షుగర్, బిపి పరీక్షలు, మందులు పంపిణీ చేయడం జరిగింది. గజపతి నగరం జనసేన నాయకులు సురేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశయంతో అయితే రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారో ప్రజలకి సేవ చేయాలని ఆలోచనతో… ఆయన ఆలోచన అనుగుణంగా ప్రజాసేవ కార్యక్రమాలు నిత్యం చేస్తున్నామని అన్నారు. గ్రామీణ ప్రాంతంలో సరైన వైద్య సదుపాయం లేక మధ్యతరగతి కుటుంబాలు సమస్యలపై నిత్యం బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికోసం ఈ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సీనియర్ నాయకులు రవికుమార్ మిడతన, గజపతినగరం నాయకులు, మహేష్, సత్యనారాయణ, హరీష్, అనిల్, పండు, శ్రీను, సురేష్ రెడ్డి జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. 

See also  నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాలని అధికారులను విన్నవించిన మాకినీడి శేషకుమారి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి