ఎమ్మిగనూరు, (జనస్వరం) : జనసేన పార్టీ సిద్ధాంతాలు మరియు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ జనసేనపార్టీ ఇంఛార్జ్ శ్రీమతి రేఖా గౌడ్ గారి ఆధ్వర్యంలో నందవరం మండలం మాచపురం గ్రామం నుండి వైయస్ఆర్ పార్టీ 20 మంది కార్యకర్తలు జనసేన పార్టీలోకి చేరటం జరిగింది. అనంతరం రేఖా గౌడ్ గారు వీరందరికీ జనసేన పార్టీ కండువాలను కప్పి, అందరినీ జనసేన పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేఖా గౌడ్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పట్ల గళమెత్తడంలోను, ప్రజల తరఫున పోరాటం చేయడంలోనూ జనసేన పార్టీ ఎల్లవేళలా ముందు ఉంటుందని తెలిపారు. సందీప్, వినయ్, పృథ్వి, రఘు మరియు తదితరులు పార్టీలో చేరటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస్ రాష్ట్ర కారదర్శి రవి ప్రకాష్ గారు మరియు జనసైనికులు పాల్గొన్నారు.