మాల మహానాడు నిరసన దీక్షకు జనసేన పార్టీ మద్దతు : పిఠాపురం ఇంఛార్జ్ మాకినీడి శేషుకుమారి

పిఠాపురం

      పిఠాపురం, (జనస్వరం) :  తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం కులాల రాజకీయాలు వద్దు – కలుపుకునే రాజకీయాలే ముద్దు అనే దిశగా జనసేన పార్టీ అడుగులు వేస్తుంది. అన్యాయం జరిగితే న్యాయపోరాటమే ధ్యేయంగా ఆపద వస్తే ఆదుకోవడం తమ కర్తవ్యంగా భావించి నియోజవర్గంలో జనసేన పోరుబాట పడుతుంది. దానికి ప్రత్యక్ష సాక్ష్యం గురువారం పివిరావు మాల మహానాడు పట్టణశాఖ ఆధ్వర్యంలో ఒకరోజు నిరసన దీక్షకు మద్దతు తెలపడమే నిదర్శనం. దీక్షను ఉద్దేశించి నియోజకవర్గ ఇంఛార్జ్ మాకీనీడి శేషకుమారి మాట్లాడుతూ ఎస్‌సి ఎస్టీలకు తండ్రి రాజశేఖర్ రెడ్డి అనేక సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టి సక్రమంగా నిర్వర్దిస్తే తనయుడు జగన్మోహన్ రెడ్డి వాటిని పక్క దారి పట్టిస్తున్నాడని, 27 సంక్షేమ పధకాలకు తూట్లు పొడవడం సరికాదని, ఎస్సీలకు కొత్తగా పధకాలు అమలు చేయకపోయినా ఉన్న పధకాలు సక్రమంగా అమలు చేస్తే ఎస్‌సిలకు న్యాయం జరిపినట్లనని అని అన్నారు.అలాగే ఈ మాల మహానాడు 27అంశాలపై చేబట్టిన దీక్షకు స్పందించి వారి డిమాండ్లను జగన్ ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షాన జనసేన మాల మహానాడు చేసే పోరాటానికి న్యాయం జరిగే వరకు మద్దతుగా ఉంటుందని, ఈ 27అంశాలు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి వివరించి వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తాని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి మొగిలి అప్పారావు, కౌన్సిలర్ అభ్యర్థి పల్నాటి మధు బాబు, బొజ్జ కుమార్, వాడ్రేవు రాహుల్, మేళం బాబీ టైల్స్, వేల్పుల చక్రధర్, గరగ బాబి, చోడిశెట్టి నాని, ఆకుల అర్జున, కొండెపూడి శివ, పసుపులేటి గణేష్, మైనబత్తుల చిన్న, సిక్కోలు రాజశేఖర్, బుర్ర విజయ్, కొడమంచిలి దుర్గాప్రసాద్, యాగ సతీష్, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు..

See also  జనవాణి జనసేన భరోసా కార్యక్రమంలో భాగంగా ఛలో విజయవాడ