జనసేన గల్ఫ్ NRI సేవా సంస్థ మొదటి వార్షికోత్సవం సందర్భంగా అనాథ పిల్లలకు బియ్యం, బట్టలు పంపిణీ

NRI

             జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, జనసేన పార్టీ సిద్దాంతాల కోసం ఏర్పాటు చేసిన జనసేన గల్ఫ్ NRI సేవా సంస్థ మొదటి వార్షికోత్సవ౦ జరుపుకుంది. ఈ సందర్భంగా కడప జిల్లా వీరబల్లి మండలంలో మైనారిటీ అనాథ పిల్లలకు బట్టలు – బియ్యం ప్యాకెట్లు పంపిణీ మరియు ప్రాణాలను కాపాడే 108 సిబ్బందికి N95 మాస్క్ లు, గ్లౌజస్, శానిటైజర్స్ పంపిణీ చేయడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ వృత్తి రీత్యా ఇతర దేశాలలో ఉంటూ NRI గల్ఫ్ జనసైనికులు పార్టీ కోసం ఎంతో సేవ చేస్తున్నారని అన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని అన్నారు. పార్టీలతో, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరికి సమన్యాయం చేసేది ఒక్క జనసేన మాత్రమే అని చెప్పారు. కరోనా కష్టకాలంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేవ కార్యక్రమం ద్వారా ఎంతో మందికి సేవలు చేశారమని అన్నారు. తదనంతరం కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

See also  రామచంద్ర నాయక్ ని ఘనంగా సన్మానం చేసిన ఆర్కేఆర్ సేవా సమితి