పలమనేరులో పాత్రికేయులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన జనసేన నాయకులు

పలమనేరు

     కరోనా పట్ల ప్రజలను జాగృతి పరిచింది పాత్రికేయులేనని పలమనేరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు పసుపులేటి దిలీప్‌ కొనియాడారు. స్థానిక పంచాయితీరాజ్‌  కార్యాలయం వద్ద ఆయన జనసైనికులతో కలిసి పాత్రికేయులకు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరోనాపై వారులో పాత్రికేయుల పాత్ర చాలా వుందన్నారు. అటువంటి వారిని జనసేన పార్టీ తరపున గౌరవించడం అభినందనీయమన్నారు. పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ది కమిటి చైర్మెన్‌ చెంగారెడ్డి, జన సైనికులు భరత్‌, సూర్యనారాయణ, అభిరామ్‌, రమేష్‌రాజు,కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

See also  మహనీయుల ఆశయాలే నేటి యువతకు మార్గదర్శకం: డా. ఒమ్మి రఘురామ్