
జనసేనాని అడుగుజాడలలో జనసైనికులు
మానవత్వం మంటగలిసిన వేళ ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లోని గన్నవరం నియోజకవర్గం సవరగూడెం గ్రామం లో కరోన మహమ్మరిని ఎదుర్కుంటున్న కుటుంబాలకు జనసైనికులు నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు పంపిణీ చేశారు. కుల, మత, పార్టీ బేధాలు చూడకుండా గ్రామంలోని కరోనా వచ్చిన బాధిత కుటుంబాలకు సొంత పార్టీ వాళ్ళే అంటరానితనంగా చూస్తు కనీసం రోజువారీ అవసరాలను ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని గ్రామంలోని జనసైనికులుని ఫోన్ లో సంప్రదించారు. వెంటనే స్పందించిన జనసైనికులు ఒక వారానికి సరిపడా నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు చంద్రశేఖర్, జ్యోతి స్వరూప్, దినేష్, దుర్గ ప్రసాద్, రావేంద్ర కుమార్, సూర్య, రాజా, భరత్, చంటి, శ్రీనివాస రావు, ఆంజనేయులు, శంకర్, బాలాజి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.








