అవెతి గ్రామంలో అగ్ని ప్రమాదం బాధిత కుటుంబాలను పరామర్శించిన మురళిరాజు

ప్రత్తిపాడు, మార్చి 30 (జనస్వరం) : వేలంగి గ్రామపంచాయతీ పరిధిలోని అవెతి గ్రామంలో గోము చల్లయమ్మ తాటాకు ఇల్లు ఇటీవల అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. అగ్ని ప్రమాద బాధితురాలు చల్లయమ్మ కుటుంబాన్ని పరామర్శించి, ఆ గిరిజన నిరుపేద కుటుంబానికి రూ. 10,000 ఆర్థిక సాయం అందజేసి, భవిష్యత్తులో చల్లయమ్మ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ సీపీ నాయకులు, నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు, ఎం.ఎం.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదునూరి మురళీకృష్ణం రాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వేలంగి సర్పంచ్ మేకల సుబ్బలక్ష్మి, సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ గుత్తుత్తి నాగేశ్వరరావు, బౌవురువాక గ్రామ సర్పంచ్ దొడ్డి సత్యనారాయణ, గౌరంపేట గ్రామ సర్పంచ్ రామిశెట్టి ఏసుబాబు, పెద్దమల్లాపురం సర్పంచ్ చెంచుబాబు, జీడం గణేష్, నిండికుండల నారాయణమూర్తి, పూసల ఏసుబాబు, వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

See also  బ్రెయిన్ స్ట్రోక్ బాధితుడికి ఇన్ఫినిటీ ట్రస్ట్ ఆర్థిక సాయం