ఉగాది అవార్డులందుకున్న ‘అనంత’ వాసులు 

అనంతపురము, మార్చి 19, జనస్వరం : శ్రీ పరాభవ నామ ఉగాది వేడుకల సందర్భంగా నలుగురు అనంతవాసులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారికి శాలువా, తెలుగుతల్లి జ్ఞాపిక, ప్రశంసాపత్రంతో పాటు పదివేల రూపాయల నగదు కూడా అందజేశారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉగాది అవార్డు అందుకున్న వారిలో వసంత కిరణ్ రాయసం, (కూచిపూడి, భరతనాట్యం), తిరుపాల్ నాయక్, (నాటకరంగం), ఉరుముల సోమశేఖర్, (జానపదం – ఉరుములు), ఏమినేని రవిచంద్ర, (జర్నలిజం) తదితరులున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉగాది వేడుకల్లో జిల్లాకు చెందిన ప్రముఖ సహస్రావధాని, అధికార భాషా సంఘం పూర్వ అధ్యక్షులు మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం చేశారు. నలుగురు అనంతవాసులు ఉగాది అవార్డు అందుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. శ్రీశ్రీ కళావేదిక రాష్ట్ర అధ్యక్షులు, ఏపీ గ్రంథాలయ పరిషత్ పూర్వ సభ్యులు గుత్తా హరిసర్వోత్తమ నాయుడు అవార్డు గ్రహీతలను కలిసి విజయవాడలో ప్రత్యేకంగా అభినందించారు.

See also  పవన్ కళ్యాణ్ గారికి "పాలాభిషేకం" చేయవలసిన కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు